పాట `192
ప: నడిపించు నానావ నడిసంద్రమున దేవా
నవ జీవన మార్గమున నాజన్మ తరింంప
1.నా జీవిత తీరమున నా యపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నాయాత్మ విరబూయ నా దీక్ష ఫలింంప
నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము ॥నడి॥
2...రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీసిలువ రమణీయ లోతులలో
రతనాలను వెదుకుటలో రాజిల్లు నా పడవ ॥నడి॥
3.ఆత్మార్పణ జేయకయే ఆశించి నీ చెలిమి అహవను
ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమీ ఆశా నిరాశయె
ఆవేదనెదురాయె ఆధ్యాత్మిక లేమిగని అల్లాడెనావలలు (నడి)
4.ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థవ మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై ంపుడు పాటింతు నీ మాట ॥నడి॥
5.లోతైన జలవలలో లోతున వినబడు స్వరమా
లోబడుటనేర్పించి లోపంబులు సవరించి
ఈవులలో లోతైన నాబ్రతుకు లోపించని
యర్పణగా లేకేశ జేయుమయా ॥నడి॥
6. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమకథ పరమాత్మ
ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును
ప్రభుకొరకు ప్రాణార్పణవ జేతు ॥నడి॥