పాట`214
ప.యెహోవాయందానందమే మహా బలము మీకు
అ.ప: ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా
1.నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు
2నీ దేవుడే నిన్ను తృప్తిచేసి నీ ఎముకలను బలపరచును
3. ఉన్నత లోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము
అ.ప: ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా
4.ఆనంద మొందుము యెహోవాలో ఆయనే తీర్చును నీవాంఛలు
5.దేవుని చిత్తమును చేయుట జీవార్ధమగు మన సంతోషము
అ.ప: ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా
6.సంపూర్ణముగ మన సంతోషము సొంపుగా యేసునిలో ఉన్నది
7.వేడిన నేడే దొరుకు మీకు నిండైన సకల సంతోషము
అ.ప: ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా
8..జీవ జలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును
9కన్నుల నుండి తుడుచును కన్నతండ్రివలె కన్నీటిని
అ.ప: ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా