పాట`131
1. నా రక్షకుని వెంబడిరతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్ పరమ కిరీట మొందువరకు
ప: యేసున్ నేను ఎన్నడెన్నడును
ఆశతో నిన్నటన్ వెంబడిరతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
మూసికొని యెక్కడేని వెళ్ళుదున్
2. నా యేసుతోడ వెళ్ళుచుందు నెల్లడన్ బ్రయాసమైన లోయలైన భయపడన్
దయజూపు యేసు నన్ను వెంబడిరచుచో భయమేల భువనంబులోదగన్ ॥యేసున్॥
3. నా కాలమెల్ల యేసునందు నమ్ముదున్ భీకరంపు వార్థియున నే దాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్ నాక మెక్కి తండ్రిజూచు వరకున్ ॥యేసున్॥