పాట-450
ప.దాహంగా ఉన్నది ఆత్మనాథుడా
జీవజలం పోసి నా దాహం తీర్చుము
పోయుము పోయుము జీవజలము
శిరస్సు నుంచి పాదము దాకా నన్ను కడుగుము
1.మోడు బారినా నా జీవితం చిగురించి ఫలించాలి నీ సన్నిధిలో
2..ప్రేమ లేని బ్రతుకు నాది నీ ప్రేమ దీపం నాలో వెలుగించుమయా
3.ఎండిన ఎడారిలో యాత్రికులము జీవజల ఊట నీవే ఆత్మనాధుడా