పాట `19
ప: ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా
నీ ప్రియుడు ధవళ వర్ణుడు రత్న వర్ణుడు
1.సన్నని నార వస్త్రవల్ సంపంగి నూనె వాసనల్
పదివేలలో నా ప్రియుని గుర్తింప జేయును ॥ఓ॥
2.పాలతో కడిగిన రీతిగా రతనాలు పొదగిన తీరుగా
ఉంగరము వలె నున్నవి అతని వంగురులు ॥ఓ॥
3.అపరంజి వంటి శిరమును నీలాల వంటి కేశముల్
గువ్వలవలె నున్నవి అతని కన్నులు ॥ఓ॥