ప: నేనును నాంంటి వారును నీతి సూర్యుని గొలుతుము
దీపమనసు గలిగి దేవుని దివ్యసేవను జేతువ
1. అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము
అనవరత మాప్రభుని చిత్తము నను కరింతుము పనులలో
2. వేదవాక్యపఠనమందు విసుగు చెందక నుందుము
ఆదరంబున దైవచిత్తము ననుసరించుచు నడుతుము
3. ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక
విసుకు చెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము
4. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితోము
భంగపరచెడి పనులనన్నిటి కృంగదీసెద మనిశము
5. ప్రేమతోడను పొరుగువారిని ప్రియు లుగను భావింతుము
క్షమj స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతువ
6. శక్తికొలది శరీర బలవను శ్రమను క్రీస్తుకు నిత్తువ భక్తితో
హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము
7. చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును
అన్నివేళల వారివృద్ధికి మిన్నగ తోడ్పడుదుము
8. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు
ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధ తోడను జూపుచు
9. జీవితంబున ప్రభుని ప్రేమాశ్శీసులను ప్రసరింతువ
దివ్యజ్యోతుల రీతి వెలుగుచు దివ్యసన్నిధి నొందుము