పాట -296
1.శుద్ధరాత్రి! సద్ధణంగ అందరు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కోనగా
పరిశుద్ధుడౌ బాలకుడా!
దివ్యనిద్ర పొమ్మా దివ్య నిద్రపొమ్మా
2.శుద్ధరాత్రి! సద్ధణంగ దూతల
హల్లెలూయ గొల్లవాండ్రకు దెలిపెను
ఎందుకిట్టులు పాడెదరు!
క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను
3.శుద్ధరాత్రి! సద్ధణంగ దేవుని కొమరుడ!
నీ ముఖంబున బ్రేమలొల్కు
నేడు రక్షణ మాకు వచ్చె
నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే