పాట`109
ప. దేవుని ఆశ్చర్య కార్యములను
అందరు చూడరండి కీర్తింతుము రండి ॥2॥
1. ఆశ్చర్యకరుడు యేసు ఆశ్చర్య క్రియలు చేసెన్ ॥2॥
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ॥2॥ ॥దేవుని॥
2. ఆశ్చర్య మాటలు పల్కెన్ అనేకుల కాశ్చర్యమాయేన్
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ।దేవుని॥
3. ఆశ్చర్య జ్ఞానమునిచ్చున్ ఆలోచన శక్తియునిచ్చున్
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ॥దేవుని॥
4. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువున్ చూచి
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ॥దేవుని॥
5. శ్రమ నొంది సిలువపై మౌనము వహించెనేసు
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ॥దేవుని॥
6. క్రీస్తుకై శ్రమ నొందుచు సహించుము అన్నిటిని
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ।దేవుని॥
7. ఆశ్చర్యకరుడు పిల్చెన్ ఆలకించి రమ్మువేగమే
అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా
॥దేవుని॥