492
ప:గొప్ప సాక్షి సముహం ఆవరించె మనపై
మేఘంలా అనురాగంలా
1.తనయుని బలినీయ వెనుకాడని విశ్వాసం
రాజ్యశాలేని స్వజనతా ఆవేశం ॥గొప్ప సాక్షి ॥
2.హనోకేలియులు దేవుని కిష్టులయే
మరణం చూడకయే కొనిపోబడే పరమునకు ॥గొప్ప సాక్షి ॥
3.బాధల హింసలలో బంధకాల ఖడ్గములో
పరలోకము కొరకు పడిరెందరో పలుశ్రమలు ॥గొప్ప సాక్షి ॥
4.పాపమును విడిచి ప్రతి భారమును మరచి
యేసుని వైపు జూచి పరుగిడుదాం పందెమున ॥గొప్ప సాక్షి ॥