పాట `99
ప: స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము
ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు
1. మనకింత వరకు సహాయపడెన్ తానప్పగించుకొనె మనకై
మనల నడిపెను సుఖముగను తనదు సత్యవ నేర్పించి కనుపాపగ కాచెఆ... ॥స్తో॥
2. ఈ ధరలోని నరులలో యధార్ధ హృదjలకు వదమున
తన చిత్తము తెలుపున్ పదిలముగ ప్రభుకన్నులు
పృధివిని పరుగెత్తు ఆ... ।స్తో॥
3. అన్ని సమయములలో కన్నులతో బోధించును నన్ను మార్చెను
తప్పినన్ పెన్నుగ హృదయము నాదరించె అన్న
గురు యేసు ఆ... ॥స్తో॥
4.అగ్నివంటికన్నులు విఘ్నవలనుండి విడిపించు తగిన
సహాయము జేయును ఎక్కాలమందును కునుకవు
మక్కువ పిల్లలకు ఆ... ।స్తో॥
5. హాగరును చూచిన కన్నులు అనేకుల చూచెను ఇశ్రాయేలుల
కనికరించె ఎజ్రాకు సహాయపడెన్ నిద్రించవు నెపుడు ఆ... ॥స్తో॥
6.నీతిమంతుల జూచె దాదిబోలె కాచెన్ జ్యోతుల
వలె నుండునుఅతిబలమిచ్చు అవసరతన్
క్షితినిను విడువడు ఆ... ।స్తో॥
7.ఏడు కన్నులు గలవాడు నేడు నాడు
కాపాడును ఎడతెగని చెడుగుల బాపున్రేడుల
నేర్పరచువాడు పాడుడి హల్లెలూయా ఆ... ॥స్తో॥