పాట `387
ప: యుగయుగములు జీవించువాడా
అల్ఫయు ఓమేఘయు నీవే
నా స్తుతులపై ఆసీనుడా
స్తుతులకు పాత్రుడా ` స్తోత్రార్హుడా ॥యుగ॥
1. మము ప్రేమించి మహిమను విడిచి ఇలకేతెంచినావు
నీ రక్తము కార్చి మమ్ము పరిశుద్ధులుగా చేశావు
సిలువలో క్రయధనం చెల్లించినావు స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా
2. మరణపు ముల్లును విరిచినావు సమాధిని గెలిచావు
మహిమ శరీరముతో లేచావు
పాపపు శిక్షను తొలగించావు
నిత్య జీవపు మార్గము చూపావు స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా
3. యేసులో ఉన్నది రక్షణ ` మనకు విజయము
లోకానికి విడుదల ` పరముకు చేర్చే దివ్య మార్గం
నాకొసగితివి ` ఆ పరమభాగ్యం స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా