పాట `186
ప: పరమాశీర్వాదము కోరి పరలోక పితా! అరుదెంచితిమి
1. తండ్రీ! యోగ్యతలేని మాకు నేడే దయచేము నీశక్తి
హృదయముల ఖాళీజేసి పరలోకపితా అరుదెంచితిమి ॥పర॥
2. ఎన్నెన్నో పాపాలు జేసి అపరాధమున ముసిగ్గునొంది మాదు
శిరములను వాల్చి పరలోకపితా అరుదెంచితిమి ॥పర॥
3. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సయుశక్తియు నీవే నిన్నే
సదా స్తుతింంచెదము పరలోకపితా! అరుదెంచితిమి ॥పర॥
4. ఇలలో శ్రమల నోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము
నీదాసులను మరువకుము పరలోకపితా! అరుదెంచితిమి ॥పర॥