పాట `73
ప: ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాథుని ప్రసన్నత
నా తోడ నడచును రానున్న కాలము కలత నివ్వదు (2)
నా మంచి కాపరి సదా నన్ను నడుపును (2)
1. ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాటయుననూ (2)
వెరవ దెన్నడు నాదు హృదయము గాయపడిన యేసు పాదం వందు నడిచెను ॥ఈ॥
2. ప్రవాహంవలె శోధకుండు ఎదరు వచ్చినా యుద్ధకేక నా నోట యేసు నామమే (2)
విరోధమైన ఆయుధాలు వేరుపరచవు(2) యెహోవా నిస్సియె నాదు హృదయము ॥ఈ॥