ప: నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుము
నావన్ని కృపచేత నీవలన నొందిన భావంబునను నేను
బహు ధైర్య వెందెద (నావన్ని)
1. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్చెద (నావన్ని)
2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని
నిత్యంబు గరముల నీ సేవ జేసెద (నావన్ని)
3. నీ సేవ జరిగెడు నీ యాలయవమునకు
నాశచే నడిపించు మరల నా పాదముల (నావన్ని)
4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త
గదలక ప్రకటింప గలిగించు దృఢభక్తి (నావన్ని)
5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమా
యావంతjైునను నాశింప మదిలోన (నావన్ని)
6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే
సేవజేయగ నిము్మ స్థిర భక్తితో నీకు (నావన్ని)
7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి
మత్తిల్లకుండగ మార్గంబు దెలుపుము (నావన్ని)
8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి
పదిలంబుగా దాని బట్టి కాపాడుమువ (నావన్ని)