పాట `168
ప:యెహోవా నా కాపరి నాకు లేమి లదు
పచ్చిక గల చోట్లన్ మచ్చికతో నడుపున్ ॥యెహో॥
1.మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్ ॥యెహో॥
2.పగవారి యెదుట ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశవెందెదను ॥యెహో॥
3.నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నుండి పొర్లుచున్నది ॥యెహో॥
3.చిరకాలదము నేను ప్రభు మందిరములో
నివాసము చేతును సంతసవెందెదను ॥యెహో॥