పాట `221
ప: సంపూర్ణమైనది నీకృప శాశ్వతమైనది నీ కృప
మరువలేను నీదు నామం మరుపురాని నీ కృప ॥సంపూర్ణ॥
1. పాపికి విడుదల నీవు చూపిన నీ కృప
పరమున చేర్చుట నీవూ చూపిన నీ కృప
ఆత్మదేవుడ నీ కృప ఆరాధ్య దైవమా నీ కృప ॥సంపూర్ణ॥
2. విద్యలేని పామరులకు నీవు చూపిన నీ కృప
తేజోవాసుల స్వాస్థమునందు నీవు చూపిన నీ కృప
ఆత్మదేవుడ నీకృప ఆరాధ్య దైవమా నీ కృప ॥సంపూర్ణ॥