ప: దశమ భాగవలెల్ల దేవునివి ధారాళముగా నియ్య సమకూడుడి
పశువులు పైరులుదేవునివి పసిడి లోహపుగనులు దేవునివి భాగ్య
భోగ్యవలెల్ల దేవునివి భావించి కానుకలను నియు్యడి (దశ)
1. దేవునివి దొంగిలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి
మదినెంచి భయమునెంచి ప్రార్థింపదలవంచి ప్రభుభాగమున్
దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యవగానుండ సమకూర్చుడీ
2. పరిశుద్ధ దేవుని మందిరము పరిపూర్ణవగాను యోచించుడీ
పరిశుద్ధ భాగము విడదీjడి పాడిపంటలు నాస్తి దేవునివి
పదియవభాగంబు దేవునిది పరమాత్మ దీవెనలను బొందుడీ (దశ)
3. ప్రధమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మదినెంచుడీ
సదమల హృదయములను బొందియు ప్రధమ భాగము
నెల్లవిడదీసిj వదమున దేవుని కర్పించుడీ సదయు
దీవెన లొంద సమకూర్చుడీ (దశ)
4. ఆకశపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలనుగుమ్మరించుదును
మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబు దొలగింతును
మీకానంద దేశమిత్తునని శ్రీకరుండెహోవా సెలవిచ్చెను (దశ)
5. దినభోజనబిచ్చు దేవునివి ఘన సౌఖ్యవలనిచ్చు దేవునిని
వినయంబుతో మదిని ధ్యానించుచు దిన భోజనంబులను
భాగించుచు మానక దేవుని కర్పించుడీ ఘనసేవ జయవెంద
పని బూనుడీ (దశ)