పాట `193
ప: నే సాగెద యేసునితో నా జీవితకాలమంతా (2)
యేసుతో గడిపెద యేసుతో నడిచెద
పరమున చేరగ నేవెళ్ళెదా (2)
హానోకు వలెసాగెద ఆ... ఆ...
1.తల్లి విడిచిన తండ్రి మరచిన
బంధువులే నను వెలివేసినా(2)
విశ్వాసముతో సాగెద ఆ... ఆ...
2.కష్టవలొచ్చినా నష్టవలొచ్చినా
శోధన బాధలుచెలరేగినా(2)
విశ్వాసముతో సాగెద ఆ... ఆ...
3.కొండలు కూలిన బండలు పగిలిన
నా జీవిత యాత్ర సాగించెదను (2)
నిరీక్షణతో సాగెద ఆ... ఆ...
4.వెనుక శత్రువులు వెంటాడినను
వందు సముద్రవ ఎదురొచ్చినా (2)
మోషేవలె సాగెద ఆ... ఆ...