పాట `189
ప: భయము లేదు దిగులులేదు జీవితయాత్రలో యేసు ప్రభువు
మనతోనుండ భయములేదుగా(2) హల్లెలూయ హల్లెలూయ ॥భయ॥
1. గాలి తుఫాను రేగి అలలు పొంగిన విశ్వాస నావ ము నుగ
కొట్టబడిన సముద్రము పొంగి నురుగుకట్టిన యేసుప్రభువు
మనతోనుండ భయములేదుగా (2) ॥భయ॥
2. వ్యాధి బాధలు నన్ను వట్టిన అంతులేని వేదన నాకు కల్గిన
గర్జించు సింహము ఎదురు వచ్చిన యేసుప్రభువు
మనతోనుండ భయము లేదుగా (2) ॥భయ॥
3. శత్రువున్ చూచి విస్మయవెందకు నీతోకూడా వచ్చువాడు
నీదేవుడే నిన్ను విడువడెన్నడూ ఎడబాయడు
యేసుప్రభువు మనతోనుండ భయములేదుగ (2) ॥భయ॥