పాట `243
ప: ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ మధుర ప్రేమ
ప్రేమను గ్రోలెద నేను దేవుని సన్నిధి యందు
1. భీతిని బాపును భయమును తొలగజేయును
పాపమును క్షమించును శాపమే బాపును
జీవమిచ్చు ప్రేమ ప్రియుడేసుని ప్రేమ నిత్యజీవమిచ్చెను (2)
2. కలతలే బాపును కన్నీరే తుడుచును
ద్వేషమే హరించును ప్రేమతో హృదిని నింపును
చింతలన్ని బాపును చిక్కులన్ని తీర్చును సంతోష తరంగమే (2)
3. నమ్మిన కలిగెను యేసుని నామమందు
ప్రార్థన చేసెదన్ దేవుని కృపనుబట్టి
జయమిచ్చు నాధుడే విజయుడు క్రీస్తే యుద్దాశూరులన్ (2)