పాట `63
ప: యెహోవా! నా బలమా! యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా... (యె)
1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తి హీనులు పొర్లిన విడువక నను ఎడబాయని దేవా యె॥
2. మరణపుటురులలో మరువక వెరలిడ ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మోర వినెను అదరెను ధరణి భయకంపముచే ॥యె॥
3. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ చేయున్
జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల జేర్చిన బలమైన దేవుడు ॥యె॥
4.పౌరుషముగల ప్రభుకోపింపగ పర్వతవల పునాదులు వణకెను
తననోట నుండి వచ్చిన యగ్ని దహించి వేసెను వైరుల నెల్లన్ ॥యె॥
5.మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును
ఉరుములు మెరుపులు మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని ॥యె॥
6 దయగలవారిపై దయచూపించును కఠినులయెడల వికటము చూపును
గర్విష్ఠుయుల యుక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి ॥యె॥
7.నా కాళ్ళను లేడి కాళ్ళగ జేసి ఎత్తంనస్థలములో శక్తితో నిలిపి
క్షణ కేడెము నా కందించి అక్షయముగ తన పక్షమున జేర్చిన ॥యె॥
8.యెహోవా జీవముగల దేవా! బహుగా స్తుతులకు అర్హడవు నీవుఅన్యజనులలో
ధన్యుతజూపుచు హల్లెలూయ స్తుతిగానవ జేసెద ॥యె॥