పాట`225
ప: సాటిలేనిది యేసుని రక్తము పాపమును
కడుగును ప్రియుడా! పాపమును కడుగును
1. చూడుము సోదరా! దేవుడు ఎంతో ప్రేమించె
ఈ జగతిన్ ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్ సిలువలో
ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను
ప్రియుడా యేసుని పంపెను ॥సాటి॥
2. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చె
ప్రియుడా ప్రాణము బలిగానిచ్చె లోకపాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపమున్ ప్రియుడా తొలగించె శాపమున్ ॥సాటి॥
3. వినుము సోదరా! ప్రభు యేసుక్రీస్తుని పరలోక వార్తను
ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి ॥సాటి॥
4. మారుమనస్సు పొందు యేసు నామమున
బాప్తీస్మము పొందుమాప్రియుడా విధేయత
చూపుమా యేసుని యామూల్య రక్త ధారలే
కడుగును పాపమెల్ల ప్రియుడా కడుగున్ పాపమెల్ల
॥సాటి॥
పాప భారమును మోసికొని నీవు ప్రయాసమొందెదవా ప్రియుడా!ప్రయాసమొందెదవా పాపమొప్పుకొని
యేసు పాదముల చెంతకుజేరుము ప్రియుడా!
చెంతకు జేరుము ॥సాటి॥