ప: మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుడు
మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా లొ ||మా||
1. కానాయను ఊరిలో మన కర్తచూచె బెండ్లిని
బానముగను ద్రాక్షరసము దానమొసగె బ్రీతిని ||మా||
2. యేసూ వీరిద్దరిని నేకముగా జేయుమీ
దాసులుగను జేసివీరి దోషములెడ బాపుమీ ||మా||
3. కర్తావీరలకు భార్యభర్తల స్నేహంబును
బూర్తిగ నీవిచ్చివీరి బొందుగాను నడుపుమీ ||మా||
4. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ
ముక్తి సరణివెదక వీరి భక్తి మిగులజయేమీ ||మా||