పాట `209
ప.సోలిపోవలదూ మనసా సోలిపోవలదూ
నినుగని పిలిచిన దేవుడు విడిచిపోతాడా ॥సోలి॥
1.ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా
ప్రియుడు నిన్ను చేరదీసినా ఆనందము కాదా ॥సోలి॥
2.శోధనలను జయించినచో భాగ్యవంతుడవు
జీవకిరీటం మోయువేళ ఎంత సంతోషమా ॥సోలి॥
3.వాక్కు యిచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్దించూ ॥సోలి॥