పాట `182
ప: భీకరుండౌ మా యెహోవా `పీఠ మెదుటం గూడరే`యేకమై
సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ॥భీకరుండౌ॥
మట్టిలోనే మమ్ము నెల్ల `మానవులుగ
సృజించెను`ఇట్టి శక్తుండౌ
ప్రభున్మే`మెచ్చుగా మది నెంతుము ॥భీకరుండౌ॥
1.ఏరితోడు లేక మము స `ర్వేశ్వరుండు
సృష్టించెను`ధారుణిం దా
నొక్కడే మా` దైవమని పూజింతుము ॥భీకరుండౌ॥
2. పుట్టగిట్టంజేయ దానై`నిట్టి దేవుని
శక్తిని `బట్టుగా లోకస్థులారా `
ప్రస్తుతింపరె భక్తిని ॥భీకరుండౌ॥
3.మేటి సంగీతంబులుపై ` మింట నారవ
మొందను ` జాటరే
వేల నోళ్ళన్ ` సన్నుతుల్ ప్రభు వందను ॥భీకరుండౌ॥
4మిక్కిలి కష్టంబులతో ` మిత్తికిని
బాల్పొందను ` దిక్కులేని గొఱ్ఱె
లట్లు ` దిరుగ జేర్పన్ మందను ॥భీకరుండౌ॥