పాట `94
ప: నీతిగల యెహోవాస్తుతి మీయాత్మతో నర్పించుడి
మీయాత్మతో సేవించుడి దాతయౌ మన క్రీస్తునీతిని
దాల్చుకొని సేవించుడి
1.చదలబుడమియు రవియు జలధియు నదులు
గిరులను జక్కగాసదమలంబగు
దైవనామము సర్వదానుతి జేయును ॥నీతి॥
2. సర్వశక్తుని కార్యములకీ సర్వ రాష్ట్రవలన్నియు గర్వములు
వీడి తలలు వంచుచు నుర్విలో నుతి జేjను ॥నీతి॥
3. పరమదూతలు నరులు పుడమిని వెరలు బెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని పాదములు సేవింపను ॥నీతి॥
4. ఇలను భక్తులు గూడుకొనియా బలము గల్గిన దేవుని
వెలj స్తుతి వేనోళ్లతోడను విసుగు జెందక జేయుడి ॥నీతి॥
5. ఆత్మనీవిక మేలుకొని శుద్ధాత్మయేసుని తండ్రిని
త్రిత్వమగునా యేకదేవుని హర్షమున సేవింపరే ॥నీతి॥