పాట `201
ప: అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి
నీదు ప్రేమ అపారవ ప్రభువా మాపై జూపితివి
1. మానవుని చేసినావు నీ స్వంత రూపవనకు
నీ కిష్టులవగా బ్రతికి దీవెనలెన్నో పొందెదము ॥అద్భు॥
2. నూతన జన్మవలన ఆశీర్వాదవలు దొరికె
శాపమును దూరపఎరచి సర్వంబు క్రొత్తజేసె ॥అద్భు॥
3. లోకమునుండి వేరై సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమును గాంతుమెంతో ॥అద్భు॥
4. తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలిపి
జీవజలమును పొంది దీవెనలెన్నో పొందెదము ॥అద్భు॥
5. ఆత్మీయవగ నడిచి శరీర క్రియలను విడిచి
ఆయన స్వరవ వినుచు దీవెనలెన్నో పొందెదము ॥అద్భు॥
6. ఆశీర్వాదవల కొరకు పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము ॥అద్భు॥