పాట`124
ప:రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి
హల్లెలూయ హా హల్లెలూయా హల్లెలూయా హా హల్లెలూయా
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2)
1.శ్రీ యేసు కాంతిలో నిలిచి సాగించు జీవిత యాత్ర (2)
బాధల నన్నింటి బాపున్ భజియించు యేసుని నామం (2) ॥హల్లె॥
2.విలువైన ఈ జీవితమున్ వెలిగించు ప్రభు కొరకు
పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్కును ప్రచురించు ॥హల్లె॥
3.మరణము జయించి లేచెన్ మరణపు ముల్లును విరిచెన్
మధురము యేసుని నామం మరవకు యేసుని ధ్యానం ॥హల్లె॥