పాట `199
ప: ఈ సాయంకాలమున యేసుప్రభో వేడెదము
నీ సుదయా రసవెల్క నిత్యంబు మముగావు
1. చెడ్డకలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో భీతి బాపువ తండ్రి ॥ఈ॥
2. దుష్ఠుండౌ శోధకుని ద్రొక్కుటకు బలమివ్మ
భ్రష్ఠత్వమున మేము పడకుండా గాపాడు ॥ఈ।
3. నీయేక పుత్రుండౌ శ్రీయేసు నామమున
సాయం ప్రార్ధన లెల్ల సరిగ నాలించుమా ॥ఈ॥
4. జనకసుత శుద్ధాత్మ ఘన దేవా స్తుతింంతు
అనిశము జీవించి రాజ్యంబు జేయుమామేన్ ॥ఈ॥