ప: సమర్పణ చేయు ము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
1. అబ్రామును అడిగెను ప్రభువపుడు ఇస్సాకును అర్పణ
ఇమ్మనెను నీ బిడ్డల సేవకు నిచ్చెదవా? నీవిచ్చెదవా (సమ)
2. ప్రియము దేవునికే హేబెలు బలి హెయము కరూనుని
అర్పణము కళంకము కల్మషమంటనివి నీవిచ్చెదవా? (సమ)
3. ఐదురొట్టెలు చేపలు రెండు ఐదువేలకు ఆహారముగ
అర్పించే నా బాలుడాకటి వేళ అట్లిచ్చెదవా? సమ)
4. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా
జీవనమంతయు దేవునికిచ్చెన్ నీవిచ్చెదవా? (సమ)
5. నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము
సజీవ యాగముగా నిచ్చెదవా? నీవిచ్చెదవా? (సమ)