పాట -452
ప:ఎంత మధురమో - యేసుని ప్రేమ
ఎంత మధురమో నా యేసుని ప్రేమ... ప్రేమా... ప్రేమా... ప్రేమా
1.అంధకారబంధము - నన్నావరించగా
అంధుడనై యేసుని - ఎరుగకుంటిని (2)
బంధముల్ తెంచెను - బ్రతికించెను నన్ను (2) ||ఎంత||
2.రక్షించువారులేక - పక్షినైతిని
భక్షకుడు బాణము - గురిపెట్టియుండెను (2)
బంధముల్ తెంచెను - బ్రతికించెను నన్ను (2) ||ఎంత||
3.ఎన్నో పాపముల చేసి - మూటకడితిని
ఎన్నో మోసములు చేసి - దోషినైతిని (2)
బంధముల్ తెంచెను - బ్రతికించెను నన్ను (2) ||ఎంత||
4.పాపరోగినై నేను - పడియుండగా
భ్రష్టుడనైన - నన్ను బ్రతికించెనుగా (2)
బంధముల్ తెంచెను - బ్రతికించెను నన్ను (2) ||
ఎంతప.స్తుతి ఘనత మహిమ ప్రభు యేసుకే చెల్లించెదన్ (2)
యేసుకే చెల్లించెదన్ ప్రభు యేసుకే చెల్లించెదన్ (2)
మహమ మహిమ నాయేసుకే
మహిమ మహిమ నారాజుకే హల్లెలూయా హల్లెలూయా (2)