ప: సమర్పించుము నీ జీవితము ప్రభుపనికై నీవు
సమర్పించుము నీ జీవితము ప్రభు మహిమతో నేడు (2)
1. దేవుడు నిను ప్రేమించెన్ తన సుతుని అర్పించెన్ (2)
అన్నిటిలో ప్రధమ ఫలముగా నొసగుము కరుణామయునికి (2)
2. భువి నుండి దశమార్పణ మానవుడు ఇచ్చునుగా (2)
దేవుడే బలియర్పణగా దివి నుండి వచ్చెనుగా (2)
3. దైవార్పణ మనుజార్పణలు స్తుతియార్పణలుగా మారెను (2)
సర్వోన్నత స్తుతులన్నియు దేవుని మందిర కృతులె (2)