పాట `266
ప: యెహోవా నా కాపరిలే`మేమి గలుగదు ` తన మహా
కృపతో బ్రోచి నన్ను` మునుపు నాతడే ॥
1. పచ్చిక గల చోట్ల నను పరుండజేయుచు ` గడు`హెచ్చగు సౌఖ్యములు సదా ` యిచ్చు నాతడే ॥
2. శాంతికర జలములకు నను ` సాగజేయుచు` వి`శ్రాంతి
ప్రాణమున కొసంగు`విభుడు అతడే ॥
3. గాడాంధకారమైన లోయల ` గుండ బోయిన `నే`కీడుకు
భయపడనిక నా ` తోడు ఆయనే ॥
4. దుడ్డుకర్రతో శత్రువుల `దరమ గొట్టుచు`దన దొడ్డు
దండముతో నీతి`దారిలో నడువు ॥
5. అందరిలో నన్ను నెంచి`యధిక ప్రేమతో ` గడు `విందు
లొసగి తృప్తిపరచు`విభుడు ఆయనే ॥
6. ముఖము కళగా నుండునట్లు `మంచి తైలమున్ `నా`
సుఖుడు నాకు బూయుండును` సకల వేళలన్ ॥
7. బ్రదుకు దినము లన్నిట నాకు ` బంటులవలెనే ` నను`వెదకి
కృపా క్షేమములు నా ` వెంటవచ్చును ॥