పాట `327
ప: ఎంతో వింత యెంతో చింత
యేసునాధుని మరణ మంత
పంతవతో జేసి రంత సొంత
ప్రజలు స్వామి నంత ॥ఎంతో॥
పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు
నాదు నకటా అట్టి శ్రమల నొంది
పలుక డాయె స్వామి నాడు ॥ఎంతో॥
వెయ్యలేని మ్రాను నొకటి
మోపిరేసు వీపు పైని
వెయ్యలేకమ్రాని తోడ
వూర్చబోయె యేసు తండ్రి
॥ఎంతో॥
కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలుచేతులలో జీలల్ కఠినులంత
గూడి కొట్టిరి ఘోరవగ
క్రీస్తేసున్ బట్టి ॥ఎంతో॥
దాహవగొన జేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివికేగె నహహా
॥ఎంతో॥
బల్లెవతో బ్రక్కన్ బొడవన్
పారె నీరు రక్తమహాహా ఏరైపారె
యేసు రక్తమెల్ల ప్రజల
కెలిమి నొసగు ॥ఎంతో॥