పాట -288
ప:సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణాల తరుణోదయం
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనవి
1.దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని
నవలోక నయనాలు మెరిశాయని పరలోక భవనాలు తెరిచాయని ఆరని,
జీవన జ్యోతిగా వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటలు పశువులశాలను ఉయల ఊపింది
ఆ జన్మమే ఒక మర్మము ఆబంధమే అనుబంధము
2.లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులం
క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే
నిను కావగా నిరుపేదగా జన్మించేగా ఇల పండుగా