పాట`226
ప: అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్దులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
1. మన యౌవన జీవితముల్ శరీరాశకు లోబరచి
చెడు మాటలను పలుకుచు శాంతిలేక యుంటిమిగా ॥అమూల్య॥
2. చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము
నరక శిక్షకు లోబడుచు పాపపు ధనమును పొందితిమి ॥అమూల్య॥
3. నిత్య సత్యదేవుని నామమున మొరలిడక
సొంతనీతి తోడనే దేవుని రాజ్యము కోరితిమి ॥అమూల్య॥
4. కనికరముగల క్రీస్తు ప్రభు మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువలో బలిచేసి మనలను విమోచించెనుగా ॥అమూల్య॥
5. తన రక్త ధారలలో మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి మనలను నింపెను జ్ఞానముతో ॥అమూల్య॥
6. పాపులమైన మన మీద తన యాశ్చర్య ఘన ప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము ॥అమూల్య॥
మన రక్షకుని స్తుతించెదము మనలను
చేసెను ధన్యులుగామన దేవుని కర్పించెదము
జీవాత్మ శరీరములన్ ॥అమూల్య॥