పాట`147
ప: గాఢాంధకారములో నేనడచిన వేళలలో
కంటిపాపవలెనన్నుకునుకక కాపాడును ప్రభువైన యేసునకు
జీవితమంతానే పాడెదన్ జడియను బెదరను
నా యేసు నాతో నుండగా (2)
1.మరణపు లోయలలోనే నడచిన వేళలలో
నీ దుడ్డుకర్రయు నీ దండము ఆదరించును
నాగిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను ॥జడి॥
2. అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా
ప్రభుయేసు కృపనన్ను ఎడబాయక కాపాడును
అభయమిచ్చి నన్ను అద్దరికిచేర్చెను ॥జడి॥
3.పర్వతములు తొలగినను మెట్టలు
దద్దరిల్లినను నీ కృపనన్ను విడువదు
నీ నిబంధన తొలగదు నీ నిత్య
సమాధానములే నన్ను నడువ జేయును ॥జడి॥