పాట `2
ప: రండి యుత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
1.రండి కృతజ్ఞత స్తోత్ర రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము ॥రండి॥
2.మన ప్రభువే మహదేవుండు ఘన మహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరవలాయనవే ॥రండి॥
3. సముద్రము సృష్టించె నాయనవే సత్యుని హస్తమే భువిచేసేన్
ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ॥రండి॥
4.ఆ ప్రభుసన్నిధి మోకరించి ఆయన ముందర మ్రూ క్కుదము
ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనముకెంతో మేలగును ॥రండి॥
5.తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నంనట్లుయుగవము నౌను ఆమెన్ ॥రండి॥