407
ప: లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై (లె)
1.ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము
భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును (లె)
2. అడవిలో నివసించుచున్న వన్నీ సుడిగాలియు మంచును
భూమిపైనున్న వన్నీ దేవా నిన్నే పొగడును (లె)
3.నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాసులు
ఆకాశన ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును (లె)