పాట`130
ప: మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై యున్నాడు
1. ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము
ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చుచున్నది ॥మన॥
2. దాని నగరులలో దేవుడాశ్రయముగ ప్రత్యక్షంబగుచున్నాడు
రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిరి ॥మన॥
3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ వేదనపట్టెను
తూర్పు గాలిని రేపి తర్ఫీదు ఓడల పగులగొట్టుచున్నావు ॥మన॥
4. సైన్యము లధిపతి యెహోవా దేవుని పట్టణమునందు
మనము వినినట్టి రీతిగ జరుగుట మనము చూచితిమి ॥మన॥
5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిర పరచియున్నాడు
దేవా నీ ఆలయమందున నీ కృపను ధ్యానించితిమి ॥మన॥
6. దేవా నీ నామము ఎంత గొప్పదో నీ సత్కీర్తియును
భూదిగంతముల వరకు అంత గొప్పదై యున్నది ॥మన॥
7. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు
మనల నడిపించును మరణ పర్యంతము హల్లెలూయా ఆమెన్ ॥మన॥