పాట `323
ప: ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందర మొందు సదా
1. మరణము మ్రింగబడె ఘన విజయము ప్రాప్తమాయె
మరణము ముల్లును విరచి జయంబును యేసు
అనుగ్రహించెన్
2. ఎవరు మనస్సు ప్రభు పై నిశ్చలముగ నిల్పెదరో
దైవశాంతి నొంది క్రీస్తుతో నిలిచి సంతస మొందెదరు
3. ఆశ్చర్యకరుడాయెనే ఆలోచన కర్తయును
నిశ్చయముగా బహుబుద్ధి వివేకము లిచ్చి నడుపు సదా
4. చంచల హృదయులును ముష్కరులగు పాపులును
వంచనలేక వాక్యమునకు తలవంచి విదేయులౌదురు
5. కుడికి తిరిగినను మరి యెడమకు తిరిగినను
నడువుడి త్రోవయిదేయను శబ్ధము చెవులకు వినబడును
6. పక్షిరాజు తనదు పిల్లల కాచెడు రీతి
రక్షణ కర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా
7. సుందరమగు రాజున్ నీ కనులతో చూచెదవు
అందమైన యా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు