ప: క్రొత్తయేడు మోదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త మనసు
తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ దత్తర పడకుండ
జేయుటుత్త మోత్త మంబుజూడ (క్రొత్త)
1. పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర డెందమందు
స్మరణ జేయుడీ ంందు మీరు మోదలుబెట్టు పందెమందు
బార వలయు నందముగను రవినిబోలి
నలయకుండ సొలయకుండ (క్రొత్త)
2. మేలుసేయ దడవొనర్పగా మీ రెరుగునట్లు కాలమంత నిరుడు
గడచెగా ప్రాలుమాలియుండకుండ జాలమేలు సేయవలయు
జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనత కొరకు (క్రొత్త)
3. బలము లేనివార మయు్యను బలవెందవచ్చు గలిమిమీర
గర్తవాక్కున నలయకుండ నడుగుచుండ నలగకుండ మోద
వెంది బలవెసంగు సర్వవిదుల నెలమి మీ రొనర్చుచుండ (క్రొత్త)
4. ఇద్దరిత్రి నుండునప్పుడే రూశ్వరుని జనులు వృద్ధిబొంద జూడ
వలయును బుద్ధినీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్దజేయ
శుద్దులైన వారిలో ప్రసిద్దులగుచు వెలుగవచ్చు (క్రొత్త)
5. పాపపంక మంటినప్పుడు ప్రభుక్రీస్తుయేసు ప్రాపుజేరి మీరు వేడగా
నేపు మీఱ దనదు కరుణ బాపమంత గడిగివేసి పాపరోగ
చిహ్నాలన్ని బాపివేసి శుద్ధిజేయు (క్రొత్త)