పాట `275
ప: దేవుడు లోకవను ఎంతో ప్రేమించెను
నిన్ను నన్ను ధరలో ప్రతివారిని
ఎంతో ప్రేమించెను ` ప్రేమించి ఏతెంచెను ॥దేవుడు॥
1. పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికి
ఆదియందున్న ఆ దేవుడు ఏతెంచె నరుడై నీ కొరకే
ఈ ప్రేమ నీ కొరకే జన్మించె ఇల నీ కొరకే ॥దేవుడు॥
2. పాపాంధ కారవలో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా
జీవపు వెలుగైన ఆ ప్రభువు వెలిగించగా వచ్చెన్ ప్రతివారిని
ఈ వెలుగు నీ కొరకే యేసు నిన్నిలా వెలిగించును ॥దేవుడు॥