పాట`148
ప: దేవుడే నాకాశ్రయంబు
దివ్యమైన దుర్గము మహావినోదు
దాపదల సహాయుడై నన్ బ్రోచును
అభయమభయ మభయమెప్పు డానంద
మానంద మానందమౌగ ॥దేవు॥
1.పర్వతములు కదిలిన నీ యుర్విమారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ సంద్రముప్పొంగినను ॥అభయ॥
దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్థిల్లును ఆతావునందు
ప్రజలు మిగుల ధన్యులై వసింతురు ॥అభయ॥
2.రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుడౌ యెహోవా వైరిన్ బూని సంహరించును ॥అభయ॥
3.విల్లు విరచునాయన తెగబల్లెము నరకు నాయన
చెల్లచెదర జేసిరివుల నెల్ల దృంచు నాయనే ॥అభయ॥
4.పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును
నశించి శత్రుగణము దేవు నాజ్ఞవలన మడియును ॥అభయ॥
5.కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగ
ఏటకింకవెరవ వలయు నెపుడు నాకు పండుగ ॥అభయ॥