పాట `282
ప: మన జీవిత మంతయు ` అనుక్షణము యుద్ధమే
ఇదియే సిలువ మార్గము ` మహిమ రాజ్యమొందను
1. ఈ యాత్రలో ముందుకు ` సాగిన తోడ్పడి
యేసుడే నడుపును మనలను ` తన మార్గము నందున
2. ఆ సిలువ మార్గము ` ఎంతో యిరుకైనది
క్రీస్తునే గురిగా నుంచిన ` విజయము నిశ్చయము
3. ఈ జగతిలో కష్టములో ` బాధలు కలిగిన
ధైర్యము విడువక యుందుము ` జయించె ప్రభువు ఇహమును