పాట -302
ప: ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం (2) ||ఇది||
1. రాజులనేలే రారాజు వెలసెను పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడూ నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదుమనకిలలో జయము జయము జయమహో ||ఇది||
2. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమగీతితో
జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||