పాట`146
ప: యెహోవా యొద్ద వరమొక్కటి విశ్వాసముతో అడిగితిని
దానిని వెదుకుచుంటిని దానిని వెదకి పొందితిని ॥యె॥
1. కలవరము లెన్నెన్నో రాగా విసికి పోతివి (2)
నా నిరీక్షణంబంతయును హరించిపోయెను (2)
తనదు పర్ణశాలయందు నన్ను దాచెను (శాంతినిచ్చెను) 2
అందుకే పాడి పొగడెదను అందుకే స్తుతి చెల్లించెదను ॥యె॥
2. ఇత్తడి తలుపుల పగులగొట్టి ద్వారం తెరచితివి (2)
అంధకార స్థలములో నున్న నిధి నొసంగితివి (2)
సరిహద్దులను విశాలపరచి (నెమ్మది నొసగితిని) (2)
అందుకే పాడి పొగడెదను అందుకే స్తుతి చెల్లించెదను ॥యె॥
3. తల్లిదండ్రులు మరచినగాని నీవు మరువవయ్యా (2)
బంధుమిత్రులు నను విడచినను ఆదుకొందువయ్యా (2)
తోడైయుందువు అంతము వరకు ఆదరింతువు (2)
అందుకే పాడి పొగడెదను అందుకే స్తుతి చెల్లించెదను ॥యె॥
4. శుద్ధమైన సువర్ణమగును నన్ను చేయుమయ్యా (2)
పవిత్రమైన సంఘ వధువుగా నన్ను సిద్ధపరచువయ్యా (2)
నా సమస్తము నీదు సేవకై నేను వ్యయపరచ నాకు
నేర్పుమయ్యా (2)
అందుకే పాడి పొగడెదను అందుకే స్తుతి చెల్లించెదను ॥యె॥