పాట`231
ప:నిన్నే పిలుస్తున్నాడు యేసు
నీవే కావాలి అంటున్నాడు యేసు
ఎలాగుంటివో అలాగునే పరుగున
రమ్ము యేసుని చేరుము
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
1.రేపు చూచుకుందాము అని ఆలస్యము చేయకు
రేపు నీకు సొంతం కానే కాదు
నేడే రక్షణ దినము నేడే మంచి రోజు
పరుగున రమ్ము యేసుని చేరుము ॥హల్లె॥
2.ఓడిపోయి బ్రతుకుదెరువు లేకపోయిందా
భవిష్యత్ అంతా చీకటిగా మారిపోయిందా (2)
నేనే నీకు వెలుగు నేనే నీకు మార్గం అంటున్నాడు
యేసుని చేరుము ॥హల్లె॥