పాట `167
ప: నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును (2)
శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను
హల్లేలూయ, హల్లేలూయ, హల్లేలూయఆమెన్...(2)
1.కడలేని కడలి తీరము యెడమాయె కడకు నా బ్రతుకునా
గురిలేని తరుణాన వెరువగా నా దరినే నిలిచావా నాప్రభు ॥నేను॥
2.జలమువలలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడిచిననూ జ్వాలలు నను కాల్చజాలవు ॥నేను॥
3.విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నాప్రభూ
సాతాను సుడిగాలి రేపగా నా యెదటే నిలిచినా నాప్రభూ ॥నేను॥