పాట `85
ప: నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా (నన్ను)
1. ముందు నీ పాదారవిందములందు నిశ్చలభక్తి ప్రేమను
పొందికగా జేయరావె నాడెందమానంద మనంతమైయుప్పొంగ ॥నన్ను॥
2. హద్దులే నట్టి దురాశల నవివేకినై కూడి యాడితి వెద్దులతో
నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ॥నన్ను॥
3.కాలము పెక్కు గతించెను గర్వాదులెడదెగవాయెను ఈలోక
మాయ సుఖేచ్చలు చాలును జాలును జాలునో తండ్రి ॥నన్ను॥
4. దారుణ సంసార వారధి దరిజూపి ప్రోవ నీకన్నను కారణ
గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ॥నన్ను॥
5. నావంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించి
రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ॥నన్ను॥